Mobile Popup Ad
Mobile Popup Ad

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలు

కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా పరిధిలోని రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ‘భూభారతి’ పేరుతో సంస్కరణలు చేపట్టిన సర్కార్… తాజాగా తహసీల్దార్ల కొరత ఉన్న చోట పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న మండలాలు, అదనపు పనిభారం ఉన్న ప్రాంతాలు, అలాగే ఎన్నికలు, విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల అమలు సమయంలో తహసీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉంటే… అక్కడ నాయబ్ తహసీల్దార్లను తాత్కాలిక తహసీల్దార్‌లుగా నియమించేందుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు తమ అవసరాలకు అనుగుణంగా వీరిని తహసీల్దార్‌లుగా నియమించుకోవచ్చని తెలిపింది. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాకు ఇతర జిల్లాల నుంచి 18 మంది డిప్యూటీ తహసీల్దార్లు రాగా… ఇక్కడి నుంచి మరో 18 మంది బదిలీ అయ్యారు.

జిల్లాల వారీగా బదిలీల వివరాలు ఇలా..

జగిత్యాల జిల్లా: జగిత్యాల నుంచి పరాంకుశం శ్రీకాంత్, ఖాజా సమీ అహ్మద్ నిజామాబాద్‌క జిల్లాకు వెళ్లారు. కుకట్ల ఉమాపతి, రాజ్‌మహమ్మద్ ఆదిలాబాద్‌, గడ్డంపల్లి శ్రీనివాస్ నిర్మల్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి వై.ఎస్. ప్రవీణ్ కుమార్, వై.గంగాధర్, బి.రాజేశ్వర్… నిర్మల్ నుంచి జి. శ్రావణి, రహమాన్ జగిత్యాలకు బదిలీపై వచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల నుంచి పుట్టపాక లీలా రాణి కామారెడ్డికి, గొడుగు రజిత కరీంనగర్‌కు, వి.శ్రవణ్ కుమార్ సిద్దిపేటకు, కె.సురేశ్ కుమార్, నిమ్మ భూపేష్ మెదక్‌ జిల్లాలకు బదిలీ అయ్యారు. అలాగే మెదక్ నుంచి ఎల్.ఎన్. వీరకుమార్, ఎస్. శ్రీకాంత్, ఎ.స్వప్న… కామారెడ్డి నుంచి జి.రవికుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చారు.

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ నుంచి పూస్పాల సాయికృష్ణ కామారెడ్డికి, పెద్దపురం కళావతి, జి. కిరణ్ కుమార్ సిద్దిపేటకు, బి.రావుడ్య ప్రేమలత మెదక్‌కు, కొండ్ర సుమలత రాజన్న సిరిసిల్లకు బదిలీ అయ్యారు. మెదక్ నుంచి శ్రీనివాస్, సిద్దిపేట నుంచి ఎస్.నవీన్ కుమార్, కామారెడ్డి నుంచి అడెపు రవి కరీంనగర్‌ జిల్లాకు బదిలీపై వచ్చారు.

పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి నుంచి ఆర్.రాముడు, ఎస్.ఈశ్వర్ మంచిర్యాలకు, ఎం. తిరుపతి ములుగుకు, కె. ధీరజ్ కుమార్, ఎన్. విజయ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. మంచిర్యాల నుంచి జి.హరిత, పతంగి భాస్కర్, భూపాలపల్లి జిల్లా నుంచి అజీముద్దీన్, సిద్ధం పోచయ్య, ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎ.రాములు పెద్దపల్లి జిల్లాకు బదిలీపై వచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>