కలం, కరీంనగర్ బ్యూరో: స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Deputy Mayor Yadagiri Sunil Rao) స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ మంచి నీటి సరఫరాలో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా దినం తప్పి దినం సురక్షితమైన త్రాగు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన నగరపాలక సంస్థ నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఫిల్టర్ బెడ్ లో 34,14 ఎంఎల్ డీ నీటి సంపులు, మోటారు పంపులు, ప్యానల్ బోర్డును పనితీరును పరిశీలించారు.
నీటి శుద్దీకర ప్రక్రియలో క్లోరినేషన్ విధానం, మానేరు డ్యాం నీటి సామర్థ్యం మోటారు పంపుల పనితీరు, వాటికి అనుసందానంగా ఉన్న ప్యానల్ బోర్డుల సాంకేతిక స్థితిగతులను స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నీటి నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం బూస్టర్ పంపులను సందర్శించి వాటి పనితీరు పరిశీలించారు. ప్రస్తుతం బూస్టర్ల ద్వారా నీటి శుద్దీకరణకు రావాటర్ సేకరిస్తున్న విధానానం, స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని ఇవ్వాలి..
నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా మోటార్లు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని, ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తితే తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచుకోవాలని స్థానిక సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా వర్షాకాలం, ఇతర వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు నీటి శుద్ధీకరణ కేంద్రంలో జరుగుతున్న క్లోరినేషన్ ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించారు. క్లోరినేషన్ విధానం లో ఆలం కలుపుతున్న వివరాలపై సిబ్బందిని ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నిర్దేశిత పరిమాణంలో ఆలం కలుపుతూ సరైన క్లోరినేషన్ చేసి ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలని సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
మేయర్ ఏమన్నారంటే..
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Deputy Mayor) మాట్లాడుతూ.. నగర ప్రజల ఆరోగ్య రక్షణే ప్రథమ ప్రాధాన్యతగా నగరపాలక సంస్థ ద్వారా సురక్షితమైన తాగు నీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. నీటి శుద్దీకర కేంద్రంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని శుద్ది చేసి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. బూస్టర్ పంపుల ద్వారా రావాటర్ ను సేకరించి సరైన పద్దతిలో ఆలం కలుపుతూ నీటిని శుద్ది చేసి లాబ్ ద్వారా నాణ్యత పరీక్షల అనంతరమే నీటిని ప్రజలకు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.
తాగునీటి సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం వహించకుండదని నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ నీటి సరఫరాలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రస్తుతం మానేరు డ్యాంలో 889 పీట్ల వద్ద నీటి సామర్ద్యం ఉందని తెలిపారు. 5.8 టీఎంసీల నీరు మానేరు డ్యాంలో ఉందని.. బూస్టర్ పంపుల ద్వారా 45 ఎంఎల్ డి రా వాటర్ ప్రతి రోజు నీటి శుద్దీకర కేంద్రంకు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
ప్రతి రోజు 40 ఎంఎల్ డి శుద్దిచేసిన సురక్షితమైన నీటిని ప్రజలకు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. మానేరు డ్యాం నీటి మట్టం 889 లెవల్ నుండి 876 వరకు ఫీట్ల వరకు కూడ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బూస్టర్ల ద్వారా రా వాటర్ తీస్కునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇంకా 13 ఫీట్ల లెవల్ డ్యాం నీటి మట్టం తగ్గే వరకు కూడ బూస్టర్ల ద్వారా నీటిని సేకరించవచ్చని ఇందులో ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ముందస్తు కార్యచరణతో నగరపాలక సంస్థ నీటి శుద్దీకరణ కేంద్రం అన్ని రకాల చర్యలు చేపడుతూ…. నీటిని క్లోరినేషన్ చేస్తుందని తెలిపారు.
ల్యాబ్ లో నీటి నాణ్యత పరీక్షలు..
సరైన మోతాదులో ఆలంను కలుపుతూ… స్టాండ్ బైలో మోటార్లను సిద్దంగా ఉంచుకొని ఎప్పటికప్పుడు నీటిని శుద్ది చేస్తుందని తెలిపారు. శుద్దీకరణ చేసిన ప్రతి సాంపిల్ ను సేకరించి స్థానిక ల్యాబ్ లో నీటి నాణ్యత పరీక్షలు చేసి అప్పుడు నీటిని లో హైలెవల్ రిజర్వాయర్, ఎంబిఆర్ లకు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఆరు నెలల వరకు కూడ మానేరు డ్యాం నుండి నీటిని సేకరించి శుద్దీకరణ చేసేందుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఆరు నెలలు గడిచిన ప్రస్తుతం ఉన్న నీటిని బూస్టర్ల ద్వారా సేకరించవచ్చని… తాగు నీటికి ఎలాంటి ఇబ్బంది తలెత్తదని యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు. కావున నగర ప్రజలు మంచి నీటి సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. త్రాగు నీటి సరఫరా పట్ల ఎవరికి భయాందోళన అవసరం లేదన్నారు. ఇటీవల వస్తున్న వార్తల పట్ల నగర ప్రజలు అపోహా చెందుతున్న నేపథ్యంలో వారి అపోహాలు తోలగించడానికి సంబంధిత సమాచారం తెలియచేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
నగరపాలక సంస్థ మంచి నీటి సరఫరా విషయంలో అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అన్ని రకాల తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం వర్షాకాలం ఆరంభం అయింది కాబట్టి వర్షాలు సమృద్దిగా కురిస్తే బూస్టర్ పంపుల అవసరం కూడా తొలగిపోతుందని… కావల్సిన రావాటర్ ను మానేరు డ్యాం నుండి సేకరించవచ్చని తెలిపారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ మంచి నీటి సరఫరా విషయంలో ఎక్కడ, ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!
Follow Us On : WhatsApp

