కలం డెస్క్: కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతుండడంతో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఢిల్లీలో ఈ నెల 10న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రాల అవసరాలు, అవి కోరుకుంటున్న కొత్త ప్రాజెక్టులు, పాలసీ నిర్ణయాల్లో మార్పులు, కేంద్రం నుంచి నిధుల విడుదలకు వస్తున్న డిమాండ్లు.. వీటన్నింటిపై ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఆమె చర్చించనున్నారు. ప్రతి ఏటా బడ్జెట్‌కు ముందు రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్లతో మీటింగ్ నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తోపాటు స్టేట్ ఫైనాన్స్ డిపార్టుమెంట్ అధికారులు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర బడ్జెట్‌ను రూపొందించే ముందు రాష్ట్రాల డిమాండ్లు, అవసరాలనుకు ఏ మేరకు నిధుల కేటాయింపు చేయాలో ఈ సమావేశం ఆధారంగా డిసైడ్ అవుతుంది.


