‘పొంగులేటి’ వేడుకలు మించిపోయేలా భట్టి కుమారుడి రిసెప్షన్!

కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి రిసెప్షన్​ (Bhatti Son Reception) వేడుకకు ఖమ్మం నగరం ముస్తాబైంది. ఆదివారం ఖమ్మంలోని వైఎస్ఆర్ కాలనీ రోడ్ లోని గ్రీన్ హిల్స్ లో ఉదయం 10 గంటలకు రిసెప్షన్​ ప్రారంభం కానుంది.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు మధిర నియోజకవర్గ ఓటర్ల కోసం డిప్యూటీ సీఎం ఈ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. తమ అభిమాన నాయకుడి కుటుంబ వేడుకను పండుగలా నిర్వహించేందుకు పార్టీ కార్యకర్తలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది.

మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూతురు స్వప్ని రెడ్డి వివాహ రిసెప్షన్​ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖమ్మం ఎస్​ఆర్​ గార్డెన్ లో ఆకాశమంత పందిరి వేసి ఘనంగా జరిపిన వేడుకలకు అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ రిసెప్షన్​ పై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనడించింది. ఈ క్రమంలో అదే జిల్లాకు చెందిన భట్టి తన కుమారుడు సూర్య విక్రమాదిత్య రిసెప్షన్​ (Bhatti Son Reception) అంతకు మించి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రిసెప్షన్ వేడుకకు సుమారు లక్ష మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే భోజన వసతులు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక వద్ద అన్ని సౌకర్యాలు కల్పించారు.

గత నెల మార్చి 5న హైదరాబాద్‌లో భట్టి కొడుకు వివాహం జరిగిన నేపథ్యంలో, స్థానిక ప్రజల ఆశీస్సుల కోసం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. “మా కుటుంబ వేడుకకు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, నియోజకవర్గ ప్రజలందరూ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి, విందును స్వీకరించి మా ఆనందాన్ని పంచుకోవాలి” అని భట్టి విక్రమార్క – నందిని దంపతులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. కాగా భట్టి విక్రమార్క కేరళంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also: పారా ఆర్చరీలో మరో సంచలనం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>