కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ జావేద్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఖమ్మంలో నిర్వహించిన జావేద్ అంతిమయాత్రలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం ముస్లిం సంప్రదాయం ప్రకారం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని, ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. మహ్మద్ జావేద్ మరణం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఖమ్మం నగర రాజకీయాలకు తీరని లోటు అని డిప్యూటీ సీఎం ఆయన సేవలను కొనియాడారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని కష్టకాలంలో కూడా పార్టీ వెంటే ఉండి, క్రమశిక్షణ గల నాయకుడిగా ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. జావేద్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని డిప్యూటీ సీఎం ప్రార్థించారు.

