Mobile Popup Ad
Mobile Popup Ad

కన్వర్టెడ్ క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దుకు బీజేపీ వినతి

కలం, నల్లగొండ : కన్వర్టెడ్ క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దు చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా (BJP SC Morcha) జిల్లా అధ్యక్షుడు పెరిక ముని డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంకూరి నర్సింహా మాట్లాడుతూ.. ఆర్టికల్ 341, ఎస్సీ ఆర్డర్ 1950 అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పులు అమలు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక ముని మాట్లాడుతూ.. అక్రమంగా ఎస్సీ సర్టిఫికెట్లు పొందుతున్న వారిపై విచారణ చేయాలన్నారు.

మత మార్పిడి తర్వాత ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపించారు. తప్పుడు ధృవపత్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో దుర్వినియోగం ఆపేందుకు కఠిన మార్గదర్శకాలు అమలు చేయాలని కోరారు. ఈ విషయంపై తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ఎస్సీలకు న్యాయం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా (BJP SC Morcha) నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు ఏలూరి శ్యామ్, చిన్నింటి జానీ, కందుకూరు సుధాకర్, కిషన్, తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.

Read Also: మారుమూల తండాకు అవార్డుల పంట.. విట్టునాయక్ తండా విజయమిది!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>