ఢిల్లీలో విషాద ఘ‌ట‌న‌.. క్లాస్‌రూమ్‌లో తొమ్మిదేళ్ల బాలిక మృతి!

క‌లం, వెబ్‌డెస్క్‌: దేశ రాజ‌ధాని ఢిల్లీ(Delhi)లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. క్లాస్‌రూంలో ఓ విద్యార్థిని ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలి మృతి చెందింది. మయూర్ విహార్ ఫేజ్-2లో ఉన్న‌ లవ్లీ హెరిటేజ్ స్కూల్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మూడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ తొమ్మిదేళ్ల విద్యార్థిని స్కూల్‌లో స్పోర్ట్స్ పీరియ‌డ్ ముగించుకొని క్లాస్‌రూమ్‌లోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత కొద్దిసేపటికే కిందపడిపోయింది.

ఈ ఘటన క్లాస్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. బాలిక కుప్పకూలడాన్ని గమనించిన టీచ‌ర్‌ వెంటనే ఆమె వద్దకు చేరుకుని కుర్చీలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. అనంతరం స్కూల్‌ సిబ్బంది బాలికను సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నిర్మాణ్ విహార్‌లోని మాలిక్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్ట‌ర్లు ప్రకటించారు. గుండెపోటు కారణంగా బాలిక మరణించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ భావనా మాలిక్ తెలిపారు.

అయితే బాలికకు సకాలంలో ప్రథమ చికిత్స, సీపీఆర్ అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భారీగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలో అత్యవసర వైద్య సదుపాయాలు సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్ పాఠశాలలో నర్సు అందుబాటులో ఉన్నారని, బాలిక కిందపడిన వెంటనే ఆసుపత్రికి తరలించామని తెలిపారు. గడ్డం వద్ద గాయమై రక్తస్రావం కావడంతో తొలుత దాని ప్రభావంతోనే స్పృహ కోల్పోయిందని భావించినట్లు చెప్పారు. మరోవైపు పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి అసలు కారణం వెల్లడికానుంది. బాలిక క‌ళ్లు తిరిగి ప‌డిపోయిన సీసీ టీవీ ఫుటేజ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Also Read : పీవీ సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>