ముధోల్ ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ నిధులు.. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

కలం, ముధోల్: ముధోల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం, అభివృద్ధి పనుల (Temple Development) కోసం ప్రభుత్వం రూ.2.07 కోట్ల నిధులు మంజూరు చేస్తూ టెక్నికల్ సాంక్షన్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) బుధవారం తెలిపారు. నియోజకవర్గంలోని ఐదు ఆలయాలకు ఈ నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.

కామోల్ గ్రామంలోని సీతారామచంద్రస్వామి దేవాలయ కళ్యాణ మండప నిర్మాణానికి రూ.50 లక్షలు, లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి రూ.35 లక్షలు, అబ్దుల్లాపూర్ గ్రామంలోని ముత్యాలమ్మ, మహాలక్ష్మి ఆలయాల నిర్మాణానికి రూ.50 లక్షలు, లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి రూ.22 లక్షలు, నర్సాపూర్ (జి) మండలం తురాటి గ్రామంలోని శివాలయ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరయ్యాయని వివరించారు. ఆలయ కమిటీలు ప్రభుత్వం నిర్దేశించిన మ్యాచింగ్ గ్రాంట్‌ను చెల్లించిన అనంతరం టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>