ఢిల్లీ హైకోర్ట్ ఆన్‌లైన్ విచార‌ణ‌.. అశ్లీల వీడియోల క‌ల‌క‌లం!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఢిల్లీ హైకోర్ట్‌ (Delhi High Court)లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఓ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ కేసుకు సంబంధించి విచార‌ణ చేప‌ట్టారు. ఈ విచారణలో పాల్గొన్న ఒక వ్యక్తి స్క్రీన్‌పై పోర్న్ వీడియోలు ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కాకుండా వింత శ‌బ్ధాలు వ‌స్తున్న మ్యూజిక్ ప్లే చేశాడు. దీంతో కోర్ట్ కార్య‌క‌లాపాల‌కు అంత‌రాయం క‌లిగింది. వీడియో కాన్ఫ‌రెన్స్ క‌ట్ చేసి మ‌ళ్లీ స్టార్ట్ చేసినా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.

శివ‌జిత్ సింగ్ అనే పేరుతో లాగిన్ అయిన వ్య‌క్తి అశ్లీల కంటెంట్ ప్ర‌ద‌ర్శించిన‌ట్లు కోర్ట్ సిబ్బంది గుర్తించారు. వెంట‌నే వీడియో కాన్ఫ‌రెన్స్ నిలిపివేశారు. మ‌ళ్లీ మ‌ళ్లీ అవే దృశ్యాలు ప్లే చేయ‌డంతో అధికారులు విసిగిపోయారు. కొద్దిసేప‌టికి యూ ఆర్ హ్యాక్‌డ్ అంటూ ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి మెసేజ్ రావ‌డంతో విచార‌ణ ర‌ద్దు చేశారు. ఇక ఈ ఘ‌ట‌న‌పై ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ప్రాథ‌మికంగా విచార‌ణ ప్రారంభించారు. యూఎస్ నుంచి హ్యాక్ చేశామ‌ని, విచార‌ణ ర‌ద్దు చేయాల‌ని హ్యాకర్లు బెదిరించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>