Mobile Popup Ad
Mobile Popup Ad

కొత్త పార్టీపై హైకోర్టులో కవితకు భారీ ఊరట

కలం, వెబ్ డెస్క్ : కొత్త రాజకీయ పార్టీ నమోదు ప్రక్రియలో కల్వకుంట్ల కవిత (Kavitha)కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో నూతన రాజకీయ పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత గతంలో అప్లై చేసుకోగా.. ఈసీ నుంచి ఆమె గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. దీంతో ఈ విషయంలో ఈసీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని కవిత తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.దీంతో కవిత పిటిషన్‍పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ఇంతకుముందు దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపినట్లు విచారణలో తేలింది. అయితే ఆ లోపాలను పూర్తిగా సరిచేసి తిరిగి దరఖాస్తు సమర్పించినట్లు కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో కవిత ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పార్టీ రిజిస్ట్రేషన్ అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.దీంతో కవిత సమర్పించిన తాజా దరఖాస్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం కోర్టుకు జవాబిచ్చింది. ఇరువురి మధ్య సయోధ్య కుదరడంతో కేసు విచారణను ముగిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>