కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విషయంలో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక ఆదేశాలు ఇచ్చింది. తన పర్మిషన్ లేకుండా ఫొటోలు, వీడియోలు, వాయిస్ వాడొద్దంటూ గత నెల డిసెంబర్ 22న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు విచారించిన కోర్టు.. ఆ ఫొటోలు, వీడియోలు వాడిన వారి వాదనలు కూడా వినాలని తెలిపింది. ఎవరెవరు ఫొటోలు, వీడియోలు వాడారో వారి ఐడీలు రిపోర్టు చేయాలని అప్పుడు కోర్టు ఆదేశించింది. తాజాగా ఈ కేసులో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఇక నుంచి పవన్ కల్యాణ్ పర్మిషన్ లేకుండా ఎవరూ ఫొటోలు, వీడియోలు వాడొద్దంటూ కోర్టు ఆదేశించింది. అలా చేస్తే చర్యలుంటాయని ఉత్తర్వుల్లో తెలిపింది.
పవన్ కల్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారని గతంలోనే ఆయన తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. పవన్ కల్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ (Morph Photos) చేసి రకరకాల బిజినెస్ వెబ్ సైట్లలో వాడుతున్నారంటూ తెలిపారు. పవన్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఒకే రోజున పిటిషన్ వేశారు ఢిల్లీ హైకోర్టులో. ఆయనకు రీసెంట్ గానే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు పవన్ (Pawan Kalyan) కు కూడా అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు.
Read Also: “జన నాయకుడు”పై ఆ ప్రచారం నిజమేనా ..?
Follow Us On : WhatsApp


