కలం, వెబ్ డెస్క్: భారతీయ పౌరసత్వం పొందడానికి ముందే ఓటర్ల జాబితాలో సోనియా గాంధీ (Sonia Gandhi) పేరు నమోదయ్యిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ పై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆమెతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఇటలీకి చెందిన సోనియా గాంధీ 1983లో భారతీయ పౌరసత్వాన్ని (Citizenship) పొందారని, కానీ దీనికి మూడేండ్ల ముందే ఆమె పేరు న్యూఢిల్లీ లోక్ సభ నియోజకవర్గంలో 1980లోనే ఓటర్ల జాబితాలో నమోదయ్యిందని పిటిషినర్ వికాస్ త్రిపాఠి రోస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. తొలుత మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో తిరస్కరణకు గురైంది.
దానికి సవాల్ చేస్తూ ఢిల్లీ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. చివరకు అది రౌస్ అవెన్యూ కోర్టుకు చేరింది. శనివారం దీన్ని విచారించిన జడ్జి.. 1980 నాటి ఓటర్ల జాభితా రికార్డులను అందులో సోనియా గాంధీ (Sonia Gandhi) పేరు ఉందన్న వివరాలను కోర్టుకు సమర్పించాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించారు. పిటిషనర్ లేవనెత్తిన ఆరోపణలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సోనియా గాంధీకి నోటీసులు జారీ చేశారు.
Read Also: అలా చేస్తే మీకే సపోర్ట్.. ప్రధానికి ప్రతిపక్షాల సంచలన లేఖ!
Follow Us On: X(Twitter)

