చిక్కుల్లో నటుడు ప్రకాశ్ రాజ్.. రూ.100 కోట్లు చెల్లిస్తాడా..?

కలం, వెబ్ డెస్క్ : శ్రీరాముడిపై నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గమంటున్నాయి. తమ మనోభావాలు కించపరిచారని ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ప్రకాష్‌రాజ్‌పై మండిపడ్డారు. ఆయనపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. దేవుడిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా, తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు.

ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే..

ఈ ఏడాది జనవరి 22న జరిగిన కేరళ సాహిత్యోత్సవ సభలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ (Prakash Raj).. “What India Loses When South India is Undermined?” అనే అంశంపై ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీలు. వనవాసం సమయంలో దక్షిణ భారతంలో అడుగుపెట్టి ఇక్కడి పండ్లు కోసుకొని తిన్నాడు. దీంతో, దక్షిణాది గిరిజన రాజు (రావణాసురుడు) ఆ పండ్లకు ఖరీదు చెల్లించాలని శ్రీరాముడిని అడిగితే శూర్పణఖ ముక్కు కోశాడు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఆ వీడియోలు మళ్లీ వైరలవుతుండటంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.

Read Also: అలా చేస్తే మీకే సపోర్ట్.. ప్రధానికి ప్రతిపక్షాల సంచలన లేఖ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>