కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కొత్తగా ఏర్పాటు చేయదలచిన ఎస్టీపీ ప్లాంట్ (Sewage Treatment Plant – STP)ను తరలించనున్నట్లు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) తెలిపారు. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 993 సర్వే నంబర్ పరిధిలోని 10 ఎకరాలలో ప్లాంట్ ఏర్పాటు పనులు ప్రారంభం అయ్యాయి. అయితే పరిసర ప్రాంతాల ప్రజల నుంచి ప్లాంట్ నిర్మాణంపై అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ప్లాంటును తరలించే నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ప్లాంట్ ఏర్పాటు వలన తమకు దుర్వాసన, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని సమీప కాలనీల ప్రజలు ఎమ్మెల్యే గూడెం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్లాంట్ ఏర్పాటు చేయనున్న స్థలంలోనే సంబంధిత శాఖల అధికారులు,స్థానిక కాలనీల ప్రజలతో కలిసి ఎమ్మెల్యే సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వెంటనే నిర్మాణ పనులను నిలిపివేయాలని ఎస్టీపీ ప్లాంట్ కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) సూచించాడు.
Read Also: అలా చేస్తే బీజేపీకి లాభం లేదు: జేపీ
Follow Us On: X(Twitter)

