అలా చేస్తే మీకే సపోర్ట్.. ప్రధానికి ప్రతిపక్షాల సంచలన లేఖ!

కలం వెబ్ డెస్క్ : 2023లో ప్రవేశ పెట్టిన పాత మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)ను పార్లమెంటులో పెడితే.. తాము వెంటనే మద్దతు ప్రకటిస్తామని ప్రతిపక్షాలు మరోసారి తేల్చి చెప్పాయి. ఈ మేరకు త్వరలోనే ప్రధానికి (PM Modi) ఈ అంశమై లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిన్న లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ చర్చించేందుకు ప్రతిపక్షాలు.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యాయి. దీనికి ఆ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ (Sonia Gandhi) కూడా హాజరయ్యారు. కేంద్రం ఏకపక్షంగా ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించినందుకు అన్ని పార్టీలకు ఆమె అభినందనలు తెలిపినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా.. అనేక అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి. తాము మహిళా రిజర్వేషన్ల బిల్లుకు వ్యతిరేకం అన్నట్లుగా ఎన్డీయే దుష్ప్రచారం చేస్తోందని.. దమ్ముంటే, 2023లో సభ ముందుకు తెచ్చిన బిల్లును మరోసారి ప్రవేశపెట్టాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. 2023లో ప్రవేశపెట్టిన చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women Reservation Bill)ను లోక్ సభ పాస్ చేయడమే కాకుండా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు అంగీకారం తెలిపాయని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) గుర్తు చేశారు. సోమవారం రోజు సభను ప్రత్యేకంగా సమావేశపరిస్తే.. భేషరతుగా మద్దతు తెలుపుతామని వివరించారు. డీ లిమిటేషన్ తో మహిళా రిజర్వేషన్ల బిల్లును కలపడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.

Read Also: చిక్కుల్లో నటుడు ప్రకాశ్ రాజ్.. రూ.100 కోట్లు చెల్లిస్తాడా..?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>