Mobile Popup Ad
Mobile Popup Ad

విషాదం.. ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi Building Collapse)లో విషాదం చోటు చేసుకుంది. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలోని సైదుల్ అజాబ్ ప్రాంతంలో ఉన్న ఐదంతుస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. మూడో అంతస్తులో నిర్మాణ పనుల కారణంగా భవనం కూలినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే అధికార యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించింది.

ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు

కూలిపోయిన ఈ భవనంలో ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్, కెఫేలు, వివిధ కార్యాలయాలు నడుస్తున్నాయి. దీంతో క్యాంటీన్ లో 30 మంది చిక్కుకపోయినట్లు సమాచారం అందుతోంది. తాజా ఘటనలో భవనం మరో లైబ్రరీ భవనంపై కూడా పడింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సహాయక సిబ్బంది 9 మందిని సురక్షితంగా కాపాడారు. తీవ్రంగా గాయపడ్డ వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>