కలం, వెబ్ డెస్క్: ఈ టెక్నాలజీ యుగంలో ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి డీప్ ఫేక్(Deepfake). మన ప్రమేయం లేకుండానే మన ఫొటోలు, వీడియోలను తమకు ఇష్టం వచ్చినట్లు మార్చి, సోషల్ మీడియాలోనూ యూట్యూబ్ లోనూ పోస్ట్ చేయడం ఈ డీప్ ఫేక్ ముఖ్య లక్షణం. మన ప్రధానితోపాటు ఎంతో మంది రాజకీయ నాయకులు, సినిమా తారలు, బిజినెస్ ప్రముఖులు ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. సామాన్యులు సైతం దీని బాధితులే. అలాంటి ఈ డీప్ ఫేక్ ను నియంత్రించాలని కోరుతూ శనివారం లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే(Shrikant Shinde) ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. ‘మోసం, వేధింపులు, తప్పుడు సమాచారం కోసం డీప్ ఫేక్(Deepfake) ను దుర్వినియోగం చేస్తున్నారు. దుర్బుద్ధితో ఇలాంటి కంటెంట్ తయారుచేసినా, ఫార్వర్డ్ చేసినా అలాంటి వాళ్లకు కఠిన పడాలి. దీనిపై విధివిధానాలతో అవసరమైన చట్టం రూపొందించాలి’ అని కేంద్రాన్ని బిల్లులో ఎంపీ కోరారు.
Read Also: మనది అత్యంత జాత్యాహంకార సమాజం: కర్ణాటక హైకోర్టు
Follow Us On : Facebook


