శాండ్ పేప‌ర్ వివాదంలో సంచ‌ల‌న నిజాలు!

క‌లం, స్పోర్ట్స్: 2018 నాటి శాండ్‌పేపర్ వివాదంపై తాజా నిజాలు బయటపడ్డాయి. బాధ్యత తీసుకోవడానికి డేవిడ్ వార్నర్ (David Warner)మొదట వెనుకాడారని తేలింది. సోమవారం ఆస్ట్రేలియా మీడియా ‘సెన్’ (SEN) నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. కేప్ టౌన్ టెస్టులో బాన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్‌తో పట్టుబడ్డాడు. అప్పుడు తన పేరు బయటపడలేదని వార్నర్ తప్పు ఒప్పుకోలేదు. బాన్‌క్రాఫ్ట్ పూర్తి నింద మోయడానికి సిద్ధపడగా, స్మిత్ సగం బాధ్యతకు ముందుకొచ్చాడు. వార్నర్ మాత్రం పక్కకు తప్పుకున్నాడు. కేప్ టౌన్ హోటల్ సమావేశంలో మిచెల్ మార్ష్ వార్నర్‌ను నిలదీశాడు. తప్పించుకోలేవని, బాన్‌క్రాఫ్ట్‌ను బలిచేయనివ్వబోమని తేల్చిచెప్పాడు.

దీంతో వార్నర్ తప్పుకు ఒప్పుకున్నా, పూర్తి బాధ్యత మాత్రం మోయనన్నాడు. ఆసీస్ జట్టు కలిసి కూర్చున్న చివరి సమావేశం అదే. వార్నర్ కోసం సమిష్టి బాధ్యత వహించబోమని కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, లయన్ స్పష్టం చేశారు. అయితే తాను వ్యతిరేకించలేదని హేజిల్‌వుడ్ వివరణ ఇచ్చారు. ఖవాజా ఆత్మకథ, బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది. అప్పటి విచారణలో నిజాలన్నీ బయటకు వచ్చాయా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>