ప్రజా వీరుడు పండుగ సాయన్న: గడ్డం ప్రసాద్

కలం, మహబూబ్‌న‌గ‌ర్ బ్యూరో: బడుగు బలహీన వర్గాల ఆత్మకూరు కోసం పోరాడిన ప్రజా వీరుడు పండుగ సాయన్న అని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) కొనియాడారు. మంగళవారం పరిగి నియోజకవర్గం గండీడ్ మండలంలోని పలు గ్రామాల్లో పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కొమిరెడ్డిపల్లి గ్రామంలో పండుగ సాయన్న విగ్రహాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి , శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి , యువకులు, గ్రామస్తులు, వివిధ మండలాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అంతకుముందు నంచర్ల గ్రామం నుంచి కొమిరెడ్డిపల్లి వరకు బైక్ ర్యాలీ సాగింది. ఈ బైక్ ర్యాలీలో యువత ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత వెన్నచేడ గ్రామంలో పండుగ సాయన్న విగ్రహాన్ని శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణ తర్వాత పండుగ సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ స్పీకర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. పండుగ సాయన్న ధనవంతులు, భూస్వాముల దగ్గర నుంచి భూములను లాక్కుని పేద ప్రజలకు పంచార‌న్నారు. ఆయ‌న‌ ఎన్నో దాన ధర్మాలు చేశార‌ని గుర్తు చేసుకున్నారు. పేదల భూములు లాక్కుంటే, ఆడబిడ్డలను అవమానిస్తే సహించలేక పోరాడిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన‌ను కొందరు బందిపోటు అన్నార‌ని, కానీ పేద ప్రజలు మాత్రం ఆయన‌ను తెలంగాణ రాబిన్ హుడ్ అని గుండెల్లో పెట్టుకున్నార‌ని పేర్కొన్నారు. పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని స్పీకర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మండల నాయకులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>