కాంగ్రెస్ భారీ ర్యాలీ.. ఎందుకో తెలుసా!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో భారీ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంవిధాన్ రక్షా ర్యాలీ (Samvidhan Raksha Rally) నిర్వహించబోతుంది. లిబర్టీ సర్కిల్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి బీఎం.సందీప్ సహా మంత్రులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొనబోతున్నారు. దీని కోసం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 37 నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేయబోతున్నారు. ఇందుకోసం నియోజకవర్గానికి ఒకరి చొప్పున 37 మందిని కో–ఆర్డినేటర్లను నియమించారు.

బీజేపీకి కౌంటర్‌గా..

ఇటీవల తెలంగాణలో బీజేపీ చేపడుతున్న ర్యాలీలకు కౌంటర్‌గా కాంగ్రెస్ సంవిధాన్ రక్షా ర్యాలీ (Samvidhan Raksha Rally) చేపట్టబోతుంది. సర్ ప్రక్రియను సమర్థించుకుంటూ హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా, కరీంనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాటికి ధీటుగా చేపట్టి.. రాజ్యాంగ రక్షణలో కాంగ్రెస్ పార్టీ పోషిస్తున్న పాత్రను దేశానికి చాటి చెప్పాలని భావిస్తోంది. దేశం దృష్టిని ఆకర్షించేలా ర్యాలీ జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది.

Also Read : నాగార్జున 100వ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్‌

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>