Mobile Popup Ad
Mobile Popup Ad

శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ హత్య: దాస్యం వినయ్ భాస్కర్

కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మరణం ఆత్మహత్య కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasari Vinay Bhaskar ) ఆరోపించారు. హన్మకొండలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా హనుమకొండలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పలువురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యయత్నాలు చేశారని.. వారి ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని ఫైర్ అయ్యారు.

అధికారంలోకి వచ్చేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం హామీ అమలును విస్మరించిందని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులు 41 రోజుల ముందే సమ్మె నోటీసులు ఇచ్చిన ఈ ప్రభుత్వం కనీసం స్పందించలేదు అని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కేసీఆర్ 90% పూర్తి చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>