కలం, వలిగొండ : వలిగొండలో (Valigonda) శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఆకాశం మేఘావృతమై, వలిగొండ గుట్టపై నుంచి దట్టమైన నల్లటి మేఘాలు పట్టణాన్ని చుట్టుముట్టాయి. కొద్దిసేపటికే భారీ వర్షం (Heavy Rain) కురవడంతో రహదారులపై రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. అకస్మాత్తుగా చీకటి కమ్ముకున్నట్లుగా వాతావరణం మారి వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలలు ముగించుకుని ఇళ్లకు తిరిగి వెళ్తున్న విద్యార్థులు వర్షంలో తడుస్తూ అవస్థలు పడ్డారు.

