ప్రభుత్వం కీలక నిర్ణయం.. సెస్‌‌కు నిధులు మంజూరు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (CESS) సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1.25 కోట్ల నిధుల (CESS Funds)ను మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో భాగంగా ‘అసిస్టెన్స్ టు సెస్‌’ పథకం కింద ఈ నిధులను ప్రణాళిక శాఖ విడుదల చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో సెస్‌కు మొత్తం రూ.5 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ప్రభుత్వం ఇదివరకే రూ.2.50 కోట్ల విడుదలకు అనుమతినిచ్చింది. తాజాగా మరో రూ.1.25 కోట్లకు పరిపాలనా అనుమతి లభించడంతో ఇప్పటివరకు మంజూరైన మొత్తం నిధులు రూ.3.75 కోట్లకు చేరాయి. కేటాయించిన బడ్జెట్‌లో ఇంకా రూ.1.25 కోట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ నిధులను సెస్‌ డైరెక్టర్ తరఫున డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి (డీడీఓ) ద్వారా డ్రా చేసుకుని హైదరాబాద్‌లోని సంస్థ ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సమ్మతించింది. నిధులు వినియోగించుకున్న ఆరు నెలల వ్యవధిలో వినియోగ ధ్రువీకరణ పత్రంతో (యూసీ) పాటు ఆడిట్ చేసిన వివరాలను సమర్పించాలని ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>