కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరం హెల్త్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarasimha) అన్నారు. మియాపూర్ లోని మాధవ్ నగర్ లో ప్రణయ చిల్డ్రన్ క్లినిక్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లినిక్ లో ఉన్న ఆధునిక ఎక్విప్మెంట్ ను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలలో మౌలిక వసతుల కల్పనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగంలో ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో సామాన్యుడికి అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు వైద్య సౌకర్యాలను బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ ప్రణయ, డాక్టర్ కె.వి. తేజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆందోల్ (Andole) నియోజకవర్గంలోని జోగిపేట పాలిటెక్నిక్ కాలేజీలో సుమారు 75 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarasimha) శంకుస్థాపన చేశారు. చౌటకూర్ మండలం శివంపేట్ లోని జోగిపేట పాలిటెక్నిక్ కళాశాలలో న్యూలాండ్ ఫౌండేషన్ సీఎస్ఆర్ రూ.43 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మెకానికల్ వర్క్‌షాప్ షెడ్‌ను ప్రారంభించారు. పాలిటెక్నిక్ కాలేజీలో డి ఎం ఎఫ్.టి 6లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన High Mast LED 4 స్ట్రీట్ లైట్లను ప్రారంభించారు. అనంతరం, 26 లక్షల రూపాయలతో తోషిబా కంపెనీ సి ఎస్ ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు. అటు 1కోటి 80 లక్షల రూపాయలతో TGSPDCL (సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్) ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 33/11 KV విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు.
Read Also: మంగ్లీని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి.. MAAకు ఫిర్యాదు!
Follow Us On: Instagram

