Mobile Popup Ad
Mobile Popup Ad

జీవన్ రెడ్డి చేరికతో BRSకు మరింత బలం: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: రాజకీయ విలువలున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్‌కు మరింత బలం చేకూరిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసిందన్నీ చెప్పారు.. ‘రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి’ అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అనడానికి జీవన్ రెడ్డి చేరిక ఒక సజీవ సాక్ష్యమన్నారు. శుక్రవారం పార్లమెంటులో జరిగిన రెండు పరిణామాలు తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయని చెప్పారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejaswisurya) తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీయడమేనని మండిపడ్డారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. తేజస్వీ సూర్య మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించింది..

అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం.. లోక్‌సభ, రాజ్యసభలో బిల్లులు పాసై, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఏర్పడిందని హరీశ్ (Harish Rao) అన్నారు. కనీస అవగాహన లేకుండా తెలంగాణపై, ఉద్యమంపై బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. ఒక ఎంపీ తప్పు మాట్లాడితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థించడం దారుణమన్నారు. బీజేపీ తక్షణమే తేజస్వీ వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేదంటే తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా బీజేపీ మిగిలిపోతుందని చెప్పారు లోక్‌సభ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే తేజస్వీకి తెలంగాణ బిడ్డల తరఫున దీటైన, మూతిపగిలే సమాధానం చెప్పేవాళ్లమని హెచ్చరించారు. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు పెదవులు మూసుకొని మౌనంగా కూర్చున్నారని మండిపడ్డారు. అదే రాజ్యసభలో ఉన్న ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్రాజెక్టులపై అవాకులు చవాకులు పేలిన కేంద్ర జలవనరుల మంత్రికి దీటైన సమాధానం ఇచ్చారని అన్నారు. స్పీకర్‌ను కలిసి ఆధారాలు చూపించి రికార్డులను సైతం సవరించారని చెప్పారు.

Read Also: మంగ్లీని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బ‌హిష్క‌రించండి.. MAAకు ఫిర్యాదు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>