Mobile Popup Ad
Mobile Popup Ad

మంగ్లీని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బ‌హిష్క‌రించండి.. MAAకు ఫిర్యాదు!

క‌లం, వెబ్ డెస్క్‌: మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో ఇరుక్కున్న సింగ‌ర్ మంగ్లీ (Singer Mangli)కి స‌రికొత్త చిక్కులు ఎదుర‌వుతున్నాయి. అడ్వొకేట్ సుబ్బారావు మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అయితే తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, బాధితుల త‌ర‌ఫున పోరాడ‌తాన‌ని మంగ్లీ మీడియా ముందుకొచ్చి చెప్పినా ఎలాంటి ఊర‌ట క‌ల‌గ‌డం లేదు. మ‌రోవైపు ఈ మైక్రో ఫైనాన్స్ వ్య‌వ‌హారంలో ర‌మావ‌త్ మ‌ధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నేడో రేపో మంగ్లీ కూడా అరెస్ట్ అవుతుందంటూ సోష‌ల్ మీడియా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్న వేళ మంగ్లీకి మ‌రో షాక్ త‌గిలింది.

మంగ్లీని ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ మా అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మోసంలో నిరుపేద బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లీని (Singer Mangli) బహిష్కరించాలని సంపత్ నాయక్ డిమాండ్ చేశారు. దీంతో మా అసోసియేష‌న్ మంగ్లీపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Read Also: ఆమెకు లైక్ కొట్టిన కోహ్లీ.. అంతా షాక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>