అంబేద్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. నిర్మల్‌లో హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం

కలం, నిర్మల్: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హమారా ప్రసాద్‌‌ (Hamara Prasad) ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన (Dalit Groups Protest) చేపట్టారు. స్థానిక అంబేద్కర్‌ చౌక్‌‌లో హమారా ప్రసాద్‌ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చరిత్రను వక్రీకరిస్తూ ఆయనను అవమానించేలా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హమారా ప్రసాద్‌ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. వెంటనే అరెస్ట్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>