కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

కలం, నిర్మల్: కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారి ఆందోళనలు, పోరాటాలపై ఆంక్షలు విధించడం, ముందస్తు అరెస్టులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ అన్నారు. బుధవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సామూహిక నిరసన దీక్ష (CITU Protest) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆశా, అంగన్వాడీ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలి

ఆశా, అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించడంతో పాటు వివిధ రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్యలపై పోరాడుతున్న కార్మికులను నిర్బంధించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కార్మిక సమస్యల పరిష్కారం కోసం మరిన్ని పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పి.సుజాత, చంద్రకళ, సుగుణ, విజయ, ఇంద్రమాల, మౌనిక, లక్ష్మి, బి.లలిత, కవిత, భాగ్య, కళ, గంగామణి, వనజ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>