కలం, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపులయిపల్లిలోని ఐడియల్ కంపెనీలో భారీ పేలుడు (Nalgonda Explosion) సంభవించింది. పేలుడు ధాటికి కంపెనీలోని భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో నలుగురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా మారింది.
గాయపడిన వారిలో ముగ్గురిని హైదరాబాద్‌కు తరలించగా, మరొకరికి కామినేని ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురు ఒడిశాకు చెందినవారు కాగా, మరొకరు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట వాసిగా అధికారులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

