‘అర్నబ్’ తుఫాన్ బీభత్సం.. చంద్రబాబుకు అమిత్ షా కీలక హామీ!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన ‘అర్నబ్’ తుఫాన్ (Cyclone Arnab) వల్ల రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లిన నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సీఎం చంద్రబాబుతో గురువారం ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో తుఫాన్ ముప్పు ఉన్న ప్రాంతాల్లో తాజా పరిస్థితులు, ఆస్తి, పంట నష్టానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, బాధిత ప్రజలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా అమిత్ షా హామీ ఇచ్చారు.

తుఫాన్ (Cyclone Arnab) తీవ్రత, దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ వ్యవస్థ, వ్యవసాయ రంగాల్లో జరిగిన తీవ్ర నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసేందుకు వెంటనే కేంద్ర బృందాలను పంపాలని సీఎం చంద్రబాబు (Chandrababu) నిన్ననే అమిత్ షాకు ప్రత్యేకంగా లేఖ రాశారు. లేఖతో పాటు స్వయంగా ఫోన్‌లో మాట్లాడి, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు , అలాగే పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. దీనిపై కేంద్ర హోంమంత్రి మరోసారి స్పందిస్తూ.. ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలతో పాటు ఇతర అత్యవసర సహాయాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నామని వెల్లడించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించే వరకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు.

Also Read : బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>