కలం, వెబ్ డెస్క్ : నాలుగు రాష్ట్రాల్లో వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నది ముఖ్యమన్నారు. బీజేపీ కంచుకోటలో బుల్లెట్ దించామా.. లేదా? అని చెప్పారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్ నాగపూర్ లో కాంగ్రెస్ గెలిచి సత్తా చూపించిందన్నారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఎస్పీ అభ్యర్థులను గెలిపించారా ?లేదా? అని ప్రశ్నించారు.
వారణాసి(Varanasi)లో బీజేపీ ఓటమి మోదీ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిందని మహేష్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు. నాగ్ పూర్, వారణాసి, గోరఖ్ పూర్ పరిస్థితిపై మోదీ జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీకి మీడియా ఫోబియా అని జర్నలిస్టులను ఎదుర్కునే ధైర్యం చేయరని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనపై యువత అసంతృప్తిగా ఉన్నారని చెప్పేందుకు.. వారణాసిలో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి దీనికి నిదర్శనమన్నారు. బీజేపీ అగ్రనేతల కంచుకోటల్లో ఆ పార్టీ నేతల ఓటమి మోదీ పాలనపై వ్యతిరేకతకు రుజువుని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని కావడం తథ్యం అని.. సర్ తో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మహేష్ గౌడ్ ఆరోపించారు. రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి రైళ్ల నిరాకరించడం కుట్ర అని విమర్శించారు. రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ శ్రేణులను ఢిల్లీకి తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Also Read : మూసీ సుందరీకరణ పేరిట భూ దోపిడీ: కేటీఆర్
Follow Us On : WhatsApp

