తుపాకీతో ఫోజులు.. గాలిలోకి కాల్పులు.. చివరికి పోలీసుల ఎంట్రీ!

‎కలం, నకిరేకల్: నకిరేకల్ మండలం నెల్లిబండ (Nellibanda) గ్రామంలో తుపాకీ ఫైరింగ్ (Gun Firing) ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. దసరా ఉత్సవాల్లో భాగంగా గ్రామంలోని జమ్మి చెట్టు వద్ద బీఆర్‌ఎస్ నాయకుడు సోమయ్య తన వద్ద ఉన్న తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. అంతటితో ఆగకుండా, తుపాకీ పట్టుకుని ఫైరింగ్ చేస్తూ ఫోటోలు, వీడియోలకు ఫోజులిచ్చారు.

‎ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు పోలీసుల దృష్టికి వెళ్లాయి. చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని ప్రదర్శించి, గాలిలోకి కాల్పులు జరపడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడినందుకు గాను బీఆర్‌ఎస్ నాయకుడు సోమయ్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతని వద్ద ఉన్న తుపాకీ, బుల్లెట్లను (రౌండ్లు) స్వాధీనం (సీజ్) చేసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలు ప్రదర్శించినా, కాల్పులు జరిపినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Also Read : మూసీ సుందరీకరణ పేరిట భూ దోపిడీ: కేటీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>