తీర ప్రాంతాలకు అలర్ట్.. దూసుకోస్తున్న ‘అక్వాన్’!

కలం, వెబ్ డెస్క్ : తీవ్ర తుపాను ‘అక్వాన్’ (Cyclone Akwan) ఆంధ్రా – ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను గత ఆరు గంటల్లో గంటకు 19 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదిలినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

నవంబర్ 19 రాత్రి 11:30 గంటల సమయానికి ‘అక్వాన్’ తుపాను 17.1 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 85.1 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఇది కళింగపట్నానికి 170 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 200 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 240 కిలోమీటర్లు, పూరీకి 310 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కొనసాగుతోంది.

నవంబర్ 20 మధ్యాహ్నంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య గోపాల్‌పూర్ సమీపంలో ఈ తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>