ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు.. ఫలితంపై మస్క్ అసంతృప్తి!

కలం, వెబ్ డెస్క్: స్పేస్‌ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా భారీగా డబ్బు ఖర్చు చేసినా ఆశించిన ఫలితం రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రిపబ్లికన్ల కోసం 500 మిలియన్​ డాలర్లు (రూ.4,200 కోట్లు) ఖర్చు చేయడం తన మూర్ఖత్వమేనని మస్క్​ చెప్పారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినా ఆశించిన ప్రభావం చూపలేకపోయామన్నారు.

రిపబ్లికన్లకు ఆధిక్యం రావడమే లక్ష్యంగా పని చేసినా అది నెరవేరలేదని మస్క్ (Elon Musk)​ తెలిపారు. అమెరికాలో ఎన్నికలు కేవలం డబ్బుతోనే ప్రభావితం కావని.. మిడ్ టర్మ్​ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని వెల్లడించారు. అయితే, టైమ్​ వెనక్కి వెళ్లగలిగితే ఎన్నికల కోసం తక్కువ మొత్తమే ఖర్చు చేసేవాడినని ఎలాన్​ మస్క్​ స్పష్టం చేశారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా డొనాల్డ్​ ట్రంప్​ కు మద్దతుగా మస్క్​ మిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>