కలం మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భీరంగూడ ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న ఓం శ్రీ సాయి కర్రీ పాయింట్ వద్దకు కర్రీ కోసం వచ్చిన ఓ కస్టమర్ కర్రీ పాయింట్‌లో పనిచేసే వ్యక్తులపై తల్వార్‌తో దాడిచేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ఓ కస్టమర్ ఓం శ్రీసాయి కర్రీ పాయింట్ దగ్గరికి రూ.10ల కర్రీ కోసం వెళ్లాడు. అయితే అక్కడ పనిచేసే వ్యక్తి రూ.10కి కర్రీ ఇవ్వలేదు. దీంతో ఆ కస్టమర్‌కు, కర్రీ పాయింట్‌లో పనిచేసే వ్యక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కస్టమర్ కర్రీ పాయింట్‌లో పనిచేసే అన్నదమ్ములు ఉదయ్ (27), అజయ్ (19)లపై తల్వార్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో వారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అమీన్‌పూర్ పోలీసులు గాయపడిన అన్నదమ్ములను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తల్వార్‌తో దాడిచేసిన వ్యక్తి అంబేద్కర్ కాలనీకి చెందిన జీవరత్నంగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

