Mobile Popup Ad
Mobile Popup Ad

CSK లోకి సంజూ.. పీయూష్ ఏమన్నాడంటే?

కలం, స్పోర్ట్స్​ : ఐపీఎల్ సీజన్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వ్యూహాలు ఇప్పుడే మొదలయ్యాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ నుంచి స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మార్పుపై టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా (Piyush Chawla) స్పందిస్తూ, సంజూ రాకతో చెన్నై జట్టు ఓపెనింగ్ సమస్యలు తీరుతాయని అభిప్రాయపడ్డారు.

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన చేశారు. వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లపై వరుసగా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు మూడో టీ20 టైటిల్‌ను అందించారు. ఈ టోర్నీలో మొత్తం 321 పరుగులు చేసిన ఆయన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచారు. సంజూ సరైన సమయంలో ఫామ్‌లోకి రావడం చెన్నై జట్టుకు, అభిమానులకు పెద్ద ఊరటనిచ్చే విషయమని చావ్లా (Piyush Chawla) పేర్కొన్నారు.

Read Also: మీ బిజీ లైఫ్ స్టైలే గుండెపోటుకు దారితీస్తోంది: డాక్టర్ వార్నింగ్

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>