పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలి: సీపీఐ డిమాండ్

కలం, హనుమకొండ : రాష్ట్రంలో పెరిగిన బియ్యం, నిత్యావసర సరుకుల ధరలను ప్రభుత్వం తక్షణమే నియంత్రించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో (CPI Hanumakonda) జరిగిన పార్టీ శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతూ నిత్యావసర సరుకులను అక్రమంగా నిల్వ చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు పప్పులు, వంటనూనె, చక్కెరను సబ్సిడీపై పంపిణీ చేయాలన్నారు. ధరల నియంత్రణ కోరుతూ ఈనెల 17న జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>