అగ్రిగోల్డ్ ఏజెంట్ల, కస్టమర్ల సమావేశాన్ని జయప్రదం చేయండి: CPI

కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా అగ్రిగోల్డ్ ఏజెంట్లు, కస్టమర్ల సమావేశం (AgriGold Meeting) ఈనెల 6వ తేదీన పార్టీ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరుగుతుందని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో బి.నరేష్ అధ్యక్షతన అగ్రిగోల్డ్ ఏజెంట్ల కస్టమర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ ఏజెంట్ల, కస్టమర్ల సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి అందరూ కలిసి కట్టుగా ఉండాలన్నారు. వారందరినీ ఐక్యం చేయడం కోసం వారికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

ఈనెల 6వ తేదీన జరిగే సమావేశానికి ముఖ్య అతిథిగా అగ్రిగోల్డ్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పశ్య పద్మ హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో సీఐడీ వారు తీసుకునే బాండ్ల వెరిఫికేషన్ సెంటర్ ను కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని చర్చించనున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో ఏజెంట్లు, కస్టమర్స్ పాల్గొని విజయవంతం చేయాలని శ్రీనివాస్ కోరారు. ఈ మీటింగ్‌లో అగ్రిగోల్డ్ ఏజెంట్లు, కస్టమర్లు బి.నరేష్, పి.శ్రీనివాస్, సతీష్, రవి, కుమార్, జ్యోతి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>