కండక్టర్ మృతి.. కొత్త రూల్‌ తీసుకొచ్చిన తెలంగాణ‌ ఆర్టీసీ!

క‌లం, వెబ్‌డెస్క్‌: మ‌ణుగూరులో ప్ర‌యాణికురాలు తోసిన ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స పొందుతూ టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) కండ‌క్ట‌ర్ ప్ర‌వ‌ళిక నేడు మృతి చెందింది. ఈ నేప‌థ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కండ‌క్ట‌ర్లు, ప్ర‌యాణికుల ర‌క్ష‌ణ కోసం బ‌స్సు డోర్లు మూసిన త‌ర్వాతే న‌డ‌పాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎమ్‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిబంధ‌న‌లు ఆర్టీసీ ప‌రిధిలోని అద్దె బస్సులు, ఈ-బ‌స్సులు స‌హా అన్ని బ‌స్సుల‌కు వ‌ర్తిస్తాయ‌ని పేర్కొంది. సిటీ బ‌స్సులు, ఆర్డిన‌రీ బ‌స్సులు, ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల‌కు ఈ నిబంధ‌న‌ల నుంచి మిన‌హాయింపు క‌ల్పించింది. ఈ నెల 7వ తేదీలోగా ఈ ఆదేశాలు అమ‌లు కావాల‌ని తెలిపింది. డిప్యూటీ ఆర్ఎమ్‌లు 7వ తేదీలోపు ఈ ఆదేశాల అమ‌లుకు సంబంధించిన నివేదిక స‌మ‌ర్పించాల‌ని సంస్థ స్ప‌ష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>