కలం, కరీంనగర్: కరీంనగర్ టవర్ సర్కిల్‌లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గ నవరాత్రి ఉత్సవాలు ప్రతిఏటా నిర్వహిస్తోంది. ఈ ఏడాది సైతం నిర్వహించే ఉత్సవాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ సభ్యులతో కలిసి కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్.. సీపీ గౌస్ ఆలం (CP Gaush Alam)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వివరాలను తెలియజేసి, కార్యక్రమానికి హాజరు కావాలని రవీందర్ సింగ్ ఆహ్వానపత్రం అందజేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే దుర్గ నవరాత్రి ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.

