నిర్మల్‌లో మంత్రుల పర్యటన.. ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

కలం, నిర్మల్ : రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారుల జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రుల పర్యటన (Ministers Visit) నేపథ్యంలో శనివారం సాయంత్రం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. మంత్రుల పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆయా శాఖల అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించి, పలు కీలక సూచనలు చేశారు. పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఏఎస్పీ సాయికిరణ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>