ఫాస్ట్ బౌలింగ్ అంటే ఇష్టం.. రోహిత్ శర్మ రివీల్

క‌లం, స్పోర్ట్స్‌: ఫాస్ట్ బౌలింగ్ అంటే తనకు చాలా ఇష్టమని టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) చెప్పాడు. చిన్నతనంలో కాంక్రీట్ పిచ్‌లు, ఆస్ట్రోటర్ఫ్‌పై ఎక్కువగా ఆడటమే దీనికి కారణమని వెల్లడించాడు. ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ’ కార్యక్రమంలో ఈ విషయాలను పంచుకున్నాడు. టాప్ బ్యాటర్లకు షాట్లు ఆడేందుకు చాలా సమయం ఉంటుందని సాధారణంగా అనుకుంటారని రోహిత్ చెప్పాడు. కానీ వాస్తవానికి బంతిని ఎదుర్కొనేందుకు అంత సమయం ఉండదని వివరించాడు.

తన చిన్ననాటి క్రికెట్ అనుభవాలే ఫాస్ట్ బౌలింగ్‌పై తనకు ప్రత్యేకమైన ఇష్టాన్ని పెంచాయని రోహిత్ తెలిపాడు. కాంక్రీట్ పిచ్‌లు, ఆస్ట్రోటర్ఫ్‌పై బంతి వేగంగా వచ్చేదని చెప్పాడు. అక్కడ బంతి పెద్దగా స్వింగ్ అయ్యేది కాదని వివరించాడు. అందుకే వేగంగా బౌలింగ్ చేసే బౌలర్లను ఎదుర్కోవడం తనకు ఇష్టమని రోహిత్ తెలిపాడు. అయితే బంతి స్వింగ్ అయితే మాత్రం కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్‌లో షాట్ ఎక్కడ ఆడాలో ఎలా నిర్ణయిస్తాడన్న ప్రశ్నకు కూడా రోహిత్ సమాధానం ఇచ్చాడు.

ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ఆడటం వల్ల అది ఇప్పుడు అలవాటుగా మారిందని చెప్పాడు. బంతి వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా ఇన్‌స్టింక్ట్‌తోనే షాట్ ఎంపిక చేసుకుంటానని వివరించాడు. అయితే కొంతమంది బౌలర్ల విషయంలో మాత్రం తనకు ప్రత్యేకమైన టార్గెట్ ఏరియాలు ఉంటాయని రోహిత్ తెలిపాడు. చిన్ననాటి కాంక్రీట్ పిచ్‌లపై మొదలైన ఆ అనుభవం.. ఇప్పుడు ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే తన బ్యాటింగ్‌లో భాగమైందని రోహిత్ మాటలతో స్పష్టమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>