అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి తీరు వివాదాస్ప‌దం.. స‌స్పెన్ష‌న్‌కు అధికార ప‌క్షం డిమాండ్‌!

క‌లం, వెబ్ డెస్క్: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) తీరు వివాదాస్ప‌దంగా మారింది. స‌భ‌లో ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి మాట్లాడుతుండ‌గా కౌశిక్ రెడ్డి ఆయ‌న‌ను బెదిరింపుల‌కు గురి చేస్తూ సైగ‌లు చేశార‌ని కాంగ్రెస్ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. కౌశిక్ రెడ్డిని స‌స్పెండ్ చేయాల‌ని అధికార ప‌క్షం నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కౌశిక్ రెడ్డిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ఎమ్మెల్యేలు య‌శ‌స్విని రెడ్డి, ఆది శ్రీనివాస్‌, మంత్రి వాకిటి శ్రీహ‌రి ప‌ట్టుబ‌డుతున్నారు. కౌశిక్ రెడ్డి ఎస్సీల‌ను అవ‌మానించేలా ప్ర‌వ‌ర్తించార‌ని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డి క‌డియం శ్రీహ‌రిని గ‌న్‌తో కాల్చి చంపేస్తాన‌ని బెదిరించార‌ని, అత‌డిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. ఎస్సీల‌ను అవ‌మానించ‌డం బీఆర్ఎస్‌కు అల‌వాటేన‌ని మంత్రి వ్యాఖ్యానించారు. మ‌రోసారి వీడియోను ప‌రిశీలించి కౌశిక్ రెడ్డి శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కౌశిక్ రెడ్డిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>