కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొన్న విషయం తెలిసిందే. కమర్షియల్ సిలిండర్లు కూడా దొరక్క వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ప్రత్యమ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు ఇండక్షన్ స్టవ్స్ (Induction Stoves) వైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా నెలకు 1.80 లక్షల అమ్మకాలు జరగగా, అమెజాన్‌లో ఒక్క రోజే 1.34 లక్షలకు పైగా స్టవ్‌లు అమ్ముడయ్యాయి. ఈ అనూహ్య డిమాండ్ కారణంగా ఎన్నో చోట్ల ‘Out of Stock’ బోర్డులు వేయాల్సి వచ్చింది.
కాగా, దేశంలో ప్రస్తుతం గ్యాస్ (Gas) సిలిండర్ సరఫరాలో అంతరాయం నెలకొనడంతో సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం ఇబ్బందులకు గురిచేస్తోంది. ధరల భారంతో పాటు, జనం భారీగా బుకింగ్స్ చేస్తుండటంతో పలు చోట్ల కృత్రిమ కొరత ఏర్పడింది. దీంతో జనాలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతూ ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: హోటళ్లు రెస్టారెంట్లకు గుడ్ న్యూస్
Follow Us On: Pinterest

