Mobile Popup Ad
Mobile Popup Ad

ఎల్పీజీ కొరత.. గ్యాస్ సిలిండర్ కు అంత్యక్రియలు

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) కార్పొరేషన్ పరిధిలో గ్యాస్ సిలిండర్ కు అంత్య క్రియలు నిర్వహించి వినూత్న నిరసన తెలిపారు. శనివారం ఖమ్మం పట్టణంలోని బైపాస్ రోడ్డు నుంచి సరిత క్లినిక్ వరకూ ఎన్ఎస్​యూఐ నేతలు గ్యాస్ సిలిండర్ తో శవ యాత్ర చేశారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు విద్యార్ది నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల వలన ఆర్ధికంగా వెనుకబడిన వారు, బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖమ్మం (Khammam) జిల్లా ప్రజలు గ్యాస్ విషయంలో ఎప్పుడూ ఇలాంటి సమస్యలు ఎదుర్కోలేదన్నారు. ప్రభుత్వం గ్యాస్ నిల్వలు సరిపోను ఉన్నాయని చెప్పడం అబద్ధమని విమర్శించారు. గ్యాస్ నిల్వలు సరిపోను ఉంటే ప్రజలకు క్యూ లో నిలబడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అలాగే కొంత మంది అక్రమార్కులు గ్యాస్ ను పక్కదారి పట్టించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, అలాంటి వారి పై నిఘా పెట్టీ, కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సరిపడ గ్యాస్ నిల్వలు లేక ప్రైవేట్ హాస్టల్ విద్యార్థులు ఆకలితో పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల అధిక ఫీజులు చెల్లిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గ్యాస్ కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఎన్ఎస్​ యూఐ జనరల్ సెక్రటరీ సయ్యద్ అసిఫ్ అలీ, విద్యార్థి సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: గ్యాస్ బుకింగ్.. ఔటాఫ్ కవరేజ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>