Mobile Popup Ad
Mobile Popup Ad

ఢిల్లీలో కట్టెల పొయ్యిపై నిషేధం ఎత్తివేత

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ వల్ల దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో (Delhi) కట్టెల పొయ్యిపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. ఇక నుంచి హోటళ్లు, రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపై వంట చేసుకోవచ్చని చెప్పింది. ఇప్పటికే అనేక నగరాల్లో గ్యాస్ కు బదులు కట్టెల పొయ్యిని వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో (Delhi) గాలి కాలుష్యం కారణంగా గతంలో కట్టెల పొయ్యిని పూర్తిగా నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు గ్యాస్ కొరత పీక్స్ కు చేరుకోవడంతో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Read Also: గ్యాస్ ఎఫెక్ట్.. ఒక్క రోజే 1.34 లక్షల ఇండక్షన్ స్టవ్స్ అమ్మకాలు

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>