నకిరేకల్‌లో కాంగ్రెస్ ‘1000 రోజుల వికాస సభ’.. ఎప్పుడంటే?

కలం, నకిరేకల్: నకిరేకల్‌లో ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ ‘1000 రోజుల వికాస సభ’కు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పీసీసీ డెలిగేట్ నకిరేకంటి ఏసుపాదం, పార్టీ మండల అధ్యక్షుడు గాథగొని కొండయ్య పిలుపునిచ్చారు.

బుధవారం మండల పరిధిలోని పాలెం, ఓగోడు, నడిగూడెం, వల్లభాపురం గ్రామాల్లో పార్టీ కార్యకర్తలతో వారు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పాలకుల తొమ్మిదేళ్ల విధ్వంసకర పాలనతో విసిగిపోయిన ప్రజలకు, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ భరోసా ఇస్తోందని తెలిపారు.

నిరుపేదలకు కనీస అవసరాలైన పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తుండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు యాస కర్ణాకర్ రెడ్డి, దాసరి వీరార్జున్ రెడ్డి, సర్పంచులు నోముల కృష్ణవేణి-గోవింద రాజు, రాచకొండ రాజేందర్, నాయకులు మాద ఎల్లేష్, వంశీ, ముచ్చపోతుల రాజు, కారింగు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>