కలం, నిజామాబాద్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి (Kamareddy) జిల్లా ఉపాధ్యక్షునిగా అంకన్న గారి నాగరాజు గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎలే మల్లికార్జున్ నియామక పత్రాన్ని పంపించారు. కామారెడ్డిలో జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా నాగరాజ్ గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు.
తనకు ఈ పదవి రావడానికి కారణం ఆయిన రాష్ట్ర నాయకులు ఇలియాస్ కు జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ ఎమ్మెల్యేలు నాయకులకు నాగరాజ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద పదవుల్లోకి వస్తున్న నాయకులు గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రభుత్వ పథకాలు జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కామారెడ్డి జిల్లాలో పార్టీ పటిష్టం కోసం తన వంతు కృషి చేస్తానని నాగరాజ్ గౌడ్ వెల్లడించారు.

