కలం, వెబ్ డెస్క్: డీ లిమిటేషన్ బిల్లు (Delimitation Bill)ను పార్లమెంటులో ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించబోతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగే ఈ భేటీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కీలక నేతలు హాజరు కాబోతున్నారు. డీ లిమిటేషన్ బిల్లులో కేంద్రం చేసిన మార్పులు చేర్పులపై చర్చించబోతున్నారు. గతంలో పార్లమెంటులో బిల్లును విజయవంతంగా అడ్డుకున్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు.. ఈ సారి అనుసరించబోయే వ్యూహంపై సమాలోచనలు జరపనున్నారు.
జనాభా లెక్కలను మినహాయించి.. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లను ఒకేసారి పెంచాలని కేంద్రం బిల్లులో ప్రతిపాదనలు చేసింది. దీనిపై కూడా కాంగ్రెస్ పలు రకాల అభ్యంతరాలు చెబుతోంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలనేది ఖరారు చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఎంపీలకు త్రీ లైన్ విప్ కూడా జారీ అయింది. సమావేశాలకు అందరూ కచ్చితంగా హాజరు కావాలని హై కమాండ్ ఆదేశించింది.

