కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఆదేశాలను కూడా పార్టీ నేతలు లెక్క చేయడం లేదు. ఏకంగా కాంగ్రెస్ మంత్రులు (Congress Ministers) సైతం రూల్స్‌కి విరుద్ధంగానే నడుచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో క్షీరాభిషేకాలు, జలాభిషేకాలు, గజమాలలు వంటి వాటిని బ్యాన్ చేస్తూ ఇటీవల కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆహారాన్ని వృధా చేసే పనులకు, జేసీబీలు, క్రేన్లతో ప్రమాదకరంగా వ్యవహరించే తీరుకు స్వస్తి పలకాలని ఆమె సూచించారు. వీటి స్థానంలో ఆహార పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ ఆదేశాలు జారీ అయిన కొద్ది రోజులకే కాంగ్రెస్ నేతలు వాటిని తుంగలో తొక్కేశారు.
తాజాగా శనివారం కొన్ని అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబులు వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని తాండూరుకు వచ్చారు. స్థానిక నాయకులు మంత్రులతో పాటు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ క్రమంలో జేసీబీతో భారీ గజమాల వేసి హంగామా చేశారు. మంత్రులు (Congress Ministers) సైతం ఈ ఆర్భాటాలకు అడ్డుచెప్పలేదు. దీంతో స్థానికులు పార్టీ ఆదేశాలను మంత్రులు కూడా పాటించకపోతే ఇక కిందిస్థాయి నాయకులు ఎలా ఫాలో అవుతారని విమర్శిస్తున్నారు.
Read Also: ఇప్పటిదాకా ఒకలెక్క.. ఇక నుంచి మరో లెక్క: కేటీఆర్ సంచలన కామెంట్స్!
Follow Us On : WhatsApp

